+91 9182346178
2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)
మూల 4 పాదములు (యె, యో, బ, బి)
పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదం (బె)
ధను రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో, మూడవ ఇంట్లో, రాహువు మీనరాశిలో, నాలుగవ ఇంటిలో, కేతువు కన్యరాశిలో, పదవ ఇంట్లో సంచరిస్తారు. గురువు మే ఒకటి వరకు ఐదవ ఇంటిలో, ఆ తర్వాత మిగిలిన సమయం అంతా వృషభ రాశిలో, ఆరవ ఇంట్లో సంచరిస్తాడు.
ధనూ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. గురు దృష్టి లాభ స్థానంపై ఉండటం వలన ఈ సమయంలో మీరు చేసే పనులు, వ్యాపారాలు బాగా కలిసి వచ్చి మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వడం వలన వ్యాపారం పెరుగుతుంది. గురు దృష్టి ఒకటో ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై కూడా ఉండటం వలన ఈ సమయంలో మీరు కొత్త ప్రదేశాల్లో మీ వ్యాపారం ప్రారంభించడం కానీ, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ చేస్తారు. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. మీ రంగంలో ప్రముఖులను, అనుభవజ్ఞులను కలవడం కానీ, వారి సలహాలు సూచనలు స్వీకరించడం కానీ చేస్తారు. దీని వలన మీరు వ్యాపారంలో మరింత వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఆరవ ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీ దగ్గర పని చేసేవారు కానీ, మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం లేదా మీకు వ్యతిరేకులుగా మారడం జరగవచ్చు. దాని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే పరిష్కారం అవుతాయి. గురు దృష్టి 12వ ఇంటి పై మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందినప్పటికీ ఆదాయం పెరగకపోవడం వలన ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు తగ్గుతాయి. మీరు మీ వ్యాపార భాగస్వాములతో కలిసి చేయాలనుకునే పనులు ఆగిపోవడం కానీ, లేదా మీ మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీ రంగంలో అనుభవజ్ఞుల లేదా నిపుణుల సలహాలు తీసుకున్నప్పటికీ వాటితో ఎక్కువ ప్రయోజనం ఉండకపోయే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా నాలుగో ఇంటిలో రాహువు మరియు పదవి ఇంటిలో కేతువు కారణంగా మీరు మీ వ్యాపార విషయంలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీ పేరు చెడిపోకుండా ఉండటానికి, వ్యాపారంలో మంచి పేరు సంపాదించడానికి ఎక్కువ కష్టపడతారు. మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని బాధకు లోనవుతారు. వ్యాపారం ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ, ఎక్కువ శ్రమ పడటం కానీ చేస్తారు. దాని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ, దాని వలన వచ్చే ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు ప్రచారం గురించి కాక, మీ వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపును కూడా తెచ్చుకుంటుంది.
ధనూ రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో గురుదృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీ పై అధికారుల సహకారం లభిస్తుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న పదోన్నతి కానీ, మారాలనుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది. మీరు విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సంవత్సరం మే ఒకటి లోపు మీ కోరిక తీరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఆలోచనలకు మీ అదృష్టం కూడా తోడై వృత్తిలో పేరుతో పాటుగా అభివృద్ధిని ఇస్తుంది. గురు దృష్టి లాభ స్థానంపై ఉండటం వలన మిత్రులు లేదా శ్రేయోభిలాషుల సహాయంతో మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మీ రంగంలో ప్రముఖులను కానీ, ఆదర్శ వ్యక్తులను కానీ కలుసుకొని వారి సలహాలు, సూచనలను తీసుకుంటారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురు గోచారం ఆరవ ఇంటికి మారటం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పదవితోపాటు బాధ్యతలు కూడా పెరగటం వల్ల తీరికలేకుండా పనిచేయాల్సి వస్తుంది. గతంలో మీకు సహకరించడం వారు కూడా ఈ సమయంలో దూరమవడం వల్ల మీరు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పడిన శ్రమకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. శని మరియు గురువుల దృష్టి 9 మరియు 12వ ఇంటిపై ఉండటం వలన విదేశీయానం చేయడం కానీ, ఒకవేళ మీరు విదేశాల్లో ఉండి సొంత ప్రాంతానికి రావాలనుకునేవారు వారి సొంత ప్రాంతానికి రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారి ప్రయత్నాలు ఫలించి వారి కోరిక నెరవేరుతుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం నాలుగవ ఇంటిలో మరియు కేతువు గోచారం పదవ ఇంట్లో ఉండటం వలన ఈ సంవత్సరం అంతా మీరు ఉద్యోగ విషయంలో కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం పోతుందనే భయంతో కానీ, లేదా చేసిన పనికి తగిన పేరు రాదనే భయంతో ఎక్కువ కష్టపడి పని చేయడం చేస్తారు. దాని కారణంగా మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసటకు గురవుతారు. ముఖ్యంగా మే ఒకటి నుంచి గురు గోచారం మధ్యమంగా ఉండడంతో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఉద్యోగ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం చేస్తారు. దాని కారణంగా మీకు మంచి పేరు వచ్చినప్పటికీ మీ భయం కారణంగా ఆ ఆనందాన్ని అనుభవించలేరు. నాలుగో ఇంట్లో రాహు గోచారం కారణంగా మీరు ఈ సంవత్సరం ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా ఉండాల్సిన రావడం కానీ లేదా ఎక్కువ సమయం మీ కార్యాలయంలో, లేదా ఉద్యోగ బాధ్యతలతో గడపడం కానీ చేస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవుతారు. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకొని సహకరిస్తారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఉంటుంది కాబట్టి మీ ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అంతే పనిలో మీ నైపుణ్యం మరియు మీ నిజాయితీ మీకు మంచి పేరు ఇవ్వటమే కాకుండా గుర్తింపును కూడా ఇస్తుంది. అయితే మీరు దానిని నిలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీ భయంతో మరింత కష్టపడి ఇతరులు చేయాల్సిన పనిని కూడా మీరు చేస్తూ వచ్చిన పేరును పోగొట్టుకునేలా చేసుకోకండి. ఈ సంవత్సరం అంతా ఉద్యోగంలో ఎటువంటి సమస్య లేనప్పటికీ, ఏదో ఒక సమస్య వస్తుందని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. వీలైనంతవరకు ఇటువంటి భయాలకు మనసులో తావివ్వకుండా నమ్మకంతో నిజాయితీగా పనిచేసే నలుగురి మెప్పు పొందండి.
ధను రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మే ఒకటి వరకు గురు దృష్టి లాభ స్థానంపై ఉండటం వలన మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల కారణంగానే కాకుండా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, వారసత్వపు ఆస్తులు కానీ ఈ సమయంలో కలిసి వస్తాయి. దాంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఇల్లు కానీ, వాహనం కానీ లేదా ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి ఒకటవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై కూడా ఉండటంతో మీరు చేసే పనులకు అదృష్టం కూడా తోడై అది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. ఈ సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. అయినప్పటికీ నిపుణుల, అనుభవజ్ఞుల సలహా లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.
మే ఒకటి నుంచి గురు గోచారం ఆరవ ఇంటికి మారడంతో ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం తగ్గనప్పటికీ వివిధ కారణాల రీత్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగటం, అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం వలన ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఖర్చు చేయాలనుకున్న డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావటం వలన బ్యాంకులో నుంచి కానీ, తెలిసిన వ్యక్తుల నుంచి కానీ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంతగా మంచిది కాదు. తప్పుడు వాటిపైన లేదా నష్టం చేసే వాటి పైన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే సూర్యుడి గోచారం కానీ, కుజుడి గోచారం కానీ అనుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడే సమయాలు తక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు కాని, ఆచరణ కానీ సరైన విధంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక నష్టాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ రిస్క్ తో కూడిన పెట్టబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
సంవత్సరం అంతా రాహు గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వలన స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరుల ప్రలోభాల కారణంగా లోపాలున్న, లేదా వివాదాలతో కూడిన స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా అన్ని పత్రాలను పరిశీలించి, నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే కొనుగోలు చేయటం మంచిది.
ధను రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. లేదా మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ సంతానం అభివృద్ధిలోకి రావటమే కాకుండా వారితో సంబంధ, బాంధవ్యాలు మెరుగుపడతాయి. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ, మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు కానీ చేస్తారు. మీ తోబుట్టువుల సహకారంతో మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యి ఉండి వివాహం గురించి ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం అవ్వడం కానీ, వివాహం నిశ్చయం అవడం కానీ అవుతుంది. ఒకవేళ మీరు వివాహితులైయుండి సంతానం గురించి ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో సంతానం అయ్యే అవకాశం బలంగా ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం 6వ ఇంటికి మారటం వలన కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు ఏర్పడటం కానీ లేదా వారి మిమ్మల్ని గౌరవించడం లేదని అపోహ ఏర్పడటం కానీ జరుగుతుంది. దీని కారణంగా ఇంట్లో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ పిల్లలు చదువు రీత్యా కాని, ఉద్యోగరీత్యా కాని మీ నుంచి దూరంగా వెళ్లడం వలన మీరు దిగులుకు లోన అయ్యే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి రెండవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే సమసిపోతాయి. మీ తోబుట్టుల అభివృద్ధికి మీరు కారణం అవుతారు మరియు వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శని దృష్టి ఐదవ మరియు తొమ్మిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పిల్లల ఆరోగ్య విషయంలో అలాగే పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మే ఒకటి తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం నాలుగో ఇంటిలో ఉంటుంది కాబట్టి దీని కారణంగా మీ ఇంట్లో కొన్నిసార్లు మీ కుటుంబంతో సంబంధం లేని విషయాల కారణంగా ఇంట్లో మనశ్శాంతి కరువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల మాటల కారణంగా లేదా వారు మీ కుటుంబ విషయాల్లో అతిగా కల్పించుకోవడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా ఒక్కోసారి మీరు ఇంట్లో ప్రశాంతంగా గడపటానికి అవకాశం దొరకకపోవచ్చు. అంతేకాకుండా మీరు ఉండే ప్రదేశంలో మార్పు కారణంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశంలో లేదా కొత్త ఇంటిలో అలవాటు పడటానికి కొంత సమయం పట్టడం అలాగే చుట్టుపక్కల వారితో సరైన అవగాహన లేకుండా ఉండటం వలన కొంత కాలం వరకు ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు, మరియు సంతోషంగా మీ కుటుంబంతో ఈ సంవత్సరాన్ని గడుపుతారు.
ధను రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు అనుకూలంగా మిగిలిన 8 నెలలు మిశ్రమంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. గురువు దృష్టి ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మీరు మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. గురువు దృష్టి లాభ స్థానంపై ఉంటుంది కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి.
మే 1 నుంచి గురు గోచారం ఆరవ ఇంటికి మారటం వలన ఆరోగ్య విషయంలో మార్పులు కనిపిస్తాయి. పాదాలు, నేత్రాలు, మరియు నడుముకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ ఆహార నియమాలను కానీ, మరియు పని చేసే విధానం కానీ సరిగా లేని కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతిలో నిల్చడం కానీ కూర్చోవడం కానీ చేయకపోవడం, అలాగే కండ్లకు విశ్రాంతి కల్పించకుండా పనిచేయటం మరియు సమయానికి కూడా ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం నాలుగో ఇంటిలో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీని కారణంగా సరైన నిద్ర లేకపోవడం వలన మీరు లేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గా ఊహించుకొని బాధపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాహువు ఆహార విషయంలో మనను తప్పు దోవ పట్టిస్తాడు కాబట్టి మీరు తినే భోజనం విషయంలో ఈ సంవత్సరం వీలైనంత నియమంగా ఉండటం మంచిది. రాహు గోచారం కారణంగా సరైన పరిశుభ్రత లేని ప్రదేశాల్లో భోజనం చేయడం కానీ, చిరుతిండ్లు అధికంగా తీసుకోవడం చేస్తారు. ఉదర సంబంధ సమస్యలతో పాటు ఊపిరితిత్తులు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ నిర్లక్ష్యం కారణంగా మాత్రమే మీ అనారోగ్యం పాలవుతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మంచిది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటి నుంచి బయటపడడానికి కృషి చేస్తారు కాబట్టి మీకు వచ్చిన ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గుతాయి. అంతేకాకుండా మీరు ఒకసారి సమస్యను అనుభవించిన తర్వాత తిరిగి అటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంతవరకు ఆహారపానియాల విషయంలో మరియు మీ దైనందిన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండటం వలన మీరు అనారోగ్యం పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.
ధనూ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం ఐదవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయం విద్యార్థులకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారిలో ఏకాగ్రత పెరగటం, చదువుపై ఆసక్తి పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా గురువుల నుంచి, పెద్దలనుంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తి కూడా కలిగి ఉంటారు. దాని కారణంగా వారు చదువులో మరియు పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ఈ సంవత్సరం విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి, లేదా ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వారు కోరుకున్న విధంగా ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో విద్యార్థులకు చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వారు చదువు విషయంలో నిర్లక్ష్యాన్ని మరియు అహంకారాన్ని ప్రదర్శించడం లేదా పెద్ద వారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన చదువులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా పరీక్షల్లో అనుకున్న స్థాయిలో రాణించక పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు వారు చదువుపై దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రతగా చదవడం మరియు పెద్దవారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం మంచిది.
ఈ సంవత్సరం అంతా నాలుగవ ఇంటిలో రాహు గోచారం కారణంగా చాలా సార్లు చదువు పరంగా ఏకాగ్రత తగ్గటం లేదా చదివే ప్రదేశంలో మార్పులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా చదువు పట్ల విద్యార్థులకు నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరిని ప్రలోభ పెట్టేవారు కానీ, వేరే విషయాలపై దృష్టి మళ్లేలా చేసేవారు కానీ ఎక్కువ అవుతారు. దాని కారణంగా చదువుపై ఏకాగ్రత లేకుండా పోతుంది. ముఖ్యంగా మే 1 తర్వాత ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు చదువు కంటే ఎక్కువ ఫలితం మీద, పేరు ప్రతిష్టల మీద దృష్టి పెట్టడం వల్ల కూడా వారు అనుకున్న ఫలితాన్ని సాధించక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా శనికి గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి, చదువు పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ సమస్యలు వచ్చినప్పటికీ వారు ఆ సమస్యలను అధిగమించి ముందుకు వెళతారు. అలాగే తల్లిదండ్రులు గాని, గురువులు కానీ వారు చదువు విషయంలో ఆందోళన చెందినప్పుడు వారిపై కోప్పడకుండా వారికి సరైన మార్గాన్ని చూపించడం వలన ఈ సంవత్సరం విద్యార్థులు చదువులో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అయితే మధ్యలో వచ్చే ఆటంకాలకు కుంగిపోకుండా, తమ ప్రయత్నాల్ని ఆపకుండా ముందుకు సాగటం వలన వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు.
ధనూ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు మరియు రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. సంవత్సరం అంతా రాహు గోచారం, మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయటం వలన అవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 4వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటు దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వీటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం, మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది.
Donec id elit non mi porta gravida at eget metus. Donec id elit non Vestibulum id ligula porta felis euism od semper. Nulla vitae elit libero
Call Us +91 9182346178
Send an Email on bssharma02@gmail.com
LIG -16 Baharath nagar Colony, Moosapet ,
Kukatpally (M), Medchal(Dt), Malkajgiri,
Hyderabad- 500018
Morning : 8:30 AM to 10:30 AM
Evening : 4:00 PM to 8:00 PM